`స‌మ్మోహ‌నం` కోసం తన పాత్రకు తానే డ‌బ్బింగ్ చెబుతున్న అదితిరావు హైద‌రీ

సుధీర్‌బాబు, అదితీరావు హైద‌రి జంట‌గా  మోహ‌న‌కృష్ణ ఇంద్ర‌గంటి ద‌ర్శ‌క‌త్వంలో  శ్రీదేవి మూవీస్ ప‌తాకంపై శివ‌లెంక కృష్ణ‌ప్ర‌సాద్ నిర్మిస్తోన్న‌ చిత్రం `స‌మ్మోహ‌నం`.  శ్రీదేవి మూవీస్ ప్రొడ‌క్ష‌న్ నెంబ‌ర్ 10గా తెర‌కెక్కుతోన్న `స‌మ్మోహ‌నం` జూన్ 15న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.    ఈ  సినిమా కోసం అదితీరావు హైద‌రి సొంతంగా డ‌బ్బింగ్ చెప్పుకొంటున్నారు .   
నిర్మాత శివ‌లెంక కృష్ణ‌ప్ర‌సాద్ మాట్లాడుతూ “ఇంద్ర‌గంటి ఎప్పుడూ తెలుగుద‌నానికి ప్రాముఖ్య‌త‌నిస్తారు.దాదాపుగా  తెలుగమ్మాయిల‌నే హీరోయిన్లుగా ఎంపిక చేసుకుంటారు. ఆయ‌న ప్ర‌తి సినిమాలోనూ ఇదే ఒర‌వ‌డిని కొన‌సాగిస్తున్నారు. `స‌మ్మోహ‌నం` నాయిక అదితిరావు హైద‌రి తెలుగు మూలాలున్న అమ్మాయి. కానీ ఈ సినిమా కోసం తెలుగు నేర్చుకుని సొంతంగా డ‌బ్బింగ్ చెబుతోంది . చాలా బాగా డ‌బ్బింగ్‌ చెబుతోంది . ఆ అమ్మాయి గొంతు కూడా చాలా బావుంది. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు జ‌రుగుతున్నాయి. ఇటీవ‌ల విడుద‌ల చేసిన తొలి పాట‌కు మంచి స్పంద‌న వ‌చ్చింది. జూన్ 15న సినిమాను విడుద‌ల చేస్తాం“ అని అన్నారు. 
ద‌ర్శ‌కుడు మాట్లాడుతూ “కొత్త ఎత్తుగడ , కొత్త పోకడ ఉన్న నవతరం కథ `స‌మ్మోహ‌నం`.  రొమాన్స్ ,హాస్యం స‌మ్మిళిత‌మై ఉంటాయి.  పి.జి.విందా ఫొటోగ్ర‌ఫీ , వివేక్ సాగ‌ర్ సంగీతం , రవీందర్ కళా దర్శకత్వం మెప్పిస్తాయి.  మంచి క‌థ‌, క‌థ‌నానికి  చ‌క్క‌టి నిర్మాణ విలువ‌లు తోడ‌య్యాయి. టైటిల్‌కి త‌గ్గ‌ట్టుగానే సినిమా మొత్తం అంద‌మైన  ఫీల్ క్యారీ చేశాం“ అని చెప్పారు. 
న‌టీన‌టులు:
సుధీర్‌బాబు, అదితిరావు హైద‌రి, డా .వీకే న‌రేశ్‌, త‌నికెళ్ల భ‌ర‌ణి, పవిత్రా లోకేష్ ,హర్షిణి , నందు,  కాదంబ‌రి కిర‌ణ్‌, హ‌రితేజ‌, రాహుల్ రామ‌కృష్ణ‌, కేదార్ శంక‌ర్‌, శిశిర్‌శ‌ర్మ  త‌దిత‌రులు.
సాంకేతిక నిపుణులు: 
ప్రొడ‌క్ష‌న్ ఎగ్జిక్యూటివ్స్:  పి. ర‌షీద్ అహ్మ‌ద్ ఖాన్‌, కె. రామాంజ‌నేయులు, కో డైర‌క్ట‌ర్‌:  కోట సురేశ్ కుమార్‌, ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్‌: య‌స్ . ర‌వీంద‌ర్‌, ఎడిట‌ర్‌:  మార్తాండ్‌.కె.వెంక‌టేశ్‌;  డైర‌క్ట‌ర్ ఆఫ్ పొటోగ్ర‌ఫీ:  పి.జి.విందా,  సంగీతం:  వివేక్ సాగ‌ర్‌, పాట‌లు: `సిరివెన్నెల‌` సీతారామ‌శాస్త్రి, రామ‌జోగయ్య‌శాస్త్రి, నిర్మాత‌:  శివ‌లెంక కృష్ణ‌ప్ర‌సాద్‌,  ర‌చ‌న‌- ద‌ర్శ‌క‌త్వం:  మోహ‌న‌కృష్ణ ఇంద్ర‌గంటి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *