‘అదుగో’ మూవీ రివ్యూ

0
274

ఇప్పుడంటే ఫ్లాపుల్లో ఉండి ర‌విబాబు ను ప‌ట్టించుకోవ‌డం లేదు కానీ ఒక‌ప్పుడు ర‌విబాబు నుంచి సినిమా వ‌స్తుందంటే దాని మీద అంచ‌నాలు బాగానే ఉండేవి. గ‌త కొంత కాలంగా వ‌రుస ప‌రాజయాల‌తో ఇబ్బందులు పడుతున్న ర‌విబాబు ఇప్పుడు ‘అదుగో..’ అంటూ పందిని ప్ర‌ధాన పాత్ర‌లో పెట్టి సినిమాను తీసి త‌న అదృష్టాన్ని ప‌రీక్షించుకోవ‌డానికి ప్రేక్ష‌కుల ముందుకొచ్చాడు. మ‌రి ఈ సినిమా అయినా ర‌విబాబును నిల‌బెట్టిందో లేదో చూద్దాం.

ఆంధ్ర‌ప్ర‌దేశ్ కొత్త రాజ‌ధాని అమ‌రావాతి కు ద‌గ్గ‌ర‌లోని పొలాల‌కు సంబంధించిన డాక్యుమెంట్ల స‌మాచారం, సంత‌కాల‌తో ఉన్న ఒక చిప్ కోసం ర‌విబాబు వెతుకుతూ ఉంటాడు. ఆ చిప్ బంటీ అనే పంది పిల్ల‌లో ఉంద‌ని తెలుసుకుంటాడు ర‌విబాబు. జంతువుల‌తో పందెం వేసే మ‌రో రెండు గ్యాంగ్ ల‌కు కూడా పంది పిల్ల కావాల్సొస్తుంది. ఆ గ్యాంగ్ కు కూడా బంటీ యే దొరుకుతాడు. ఇదిలా ఉండ‌గా ఒక ప్రేమ జంట విడిపోవడానికి కార‌ణం కూడా బంటీయే అవుతాడు. అస‌లు బంటీ లోకి ఆ చిప్ ఎలా వ‌చ్చింది? చిప్ కోసం బంటీని చంపేస్తారా? అన్న‌ది మిగ‌తా క‌థ‌

పేరుకు హీరో అని చెప్ప‌డం త‌ప్పించి అభిషేక్ వ‌ర్మ అస‌లు హీరో మెటీరియ‌లే కాదు అనిపిస్తుంది. న‌భా నటేష్ ఉన్నంత‌లో అందంతో, న‌ట‌న‌తో ఆక‌ట్టుకుంటుంది కానీ త‌న పాత్ర‌కు పెద్ద‌గా ప్రాధాన్యమేమీ లేదు. ర‌విబాబు ఎప్ప‌టిలాగే మెప్పించాడు. మిగిలిన వారు త‌మ త‌మ పాత్ర‌ల ప‌రిధిలో చేశారు.

ఒక కొత్త ప్లాట్ నుంచి క‌థ‌ను తీసుకున్న‌ప్పుడు దాన్ని అంతే కొత్త‌గా తెర‌కెక్కించిన‌ప్పుడే ఆ క‌థ‌కు విలువుంటుంది. పంది తో సినిమా తీస్తున్నాడు అంటే కొత్త‌గా లేక‌పోతే ర‌విబాబు ఇలాంటి ఆలోచ‌న చేయ‌డులే అనుకుని సినిమాకెళ్తే బుక్కైపోయిన‌ట్లే. మ‌నుషుల‌తో పాటూ పందిని కూడా పెట్టి సినిమా తీశాడే త‌ప్పించి, కొత్తగా త‌ను చేసిందేమీ లేదు. ఎంత ఎమోష‌న‌ల్ గా క‌నెక్ట్ చేద్దామ‌ని చూసినా ప్రేక్ష‌కుడు క‌నెక్ట్ అయ్యే ఛాన్సే లేదు. ఇక ఆ రౌడీ గ్యాంగ్ క్యారెక్ట‌రైజేష‌న్ ను ఎక్క‌డ చూసి ఇన్‌స్పైర్ అయ్యి రాసుకున్నారో కానీ అబ్బా ఏంటిది మాకు అనిపిస్తుంది. ఇప్ప‌టికైనా ర‌విబాబు త‌న పంథా మారిస్తే త‌ప్ప విజ‌యాల బాట‌లోకి రాలేడు. సినిమాటోగ్ర‌ఫీ బాగానే ఉంది. పాట‌లు కూడా గొప్ప‌గా లేవు. ఉన్నంత‌లో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బావుంది. ఎడిట‌ర్ ఇంకాస్త త‌న క‌త్తెర‌కు ప‌ని చెప్పుంటే ప్రేక్ష‌కుడిని కాపాడిన వాడ‌య్యేవాడు. గ్రాఫిక్స్ బానే ఉంది. నిర్మాణ విలువ‌లు బావున్నాయి.

పంచ్‌లైన్ః అదుగో.. ర‌విబాబుకు ఇంకొక అప‌జ‌యం
ఫిల్మ్‌జ‌ల్సా రేటింగ్ః 1.5/5

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here