‘ఆచారి అమెరికా యాత్ర’ మూవీ రివ్యూ

0
203

దేనికైనా రెడీ, ఆడోర‌కం ఈడోర‌కం లాంటి వ‌రుస విజ‌యాల త‌ర్వాత మంచు విష్ణు, డైర‌క్ట‌ర్ నాగేశ్వ‌ర రెడ్డి కాంబినేష‌న్ లో వ‌స్తున్న సినిమా ఆచారి అమెరికా యాత్ర‌. ఎన్నో వాయిదాల త‌ర్వాత విడుద‌లైన ఈ సినిమా వీరిద్ద‌రికి హ్యాట్రిక్ హిట్ ను ఇచ్చిందా లేదా అన్న‌ది స‌మీక్ష‌లో చూద్దాం.

క‌థః
వృత్తి ప‌రంగా పంతులు అయిన విష్ణు అనుకోని కార‌ణాల వ‌ల్ల అమెరికా వెళ్ల‌వ‌ల‌సి వ‌స్తుంది. అస‌లు కృష్ణ‌మాచారి (విష్ణు) కు ఎదురైన ఆ ప‌రిస్థితులేంటి? వాటి నుంచి ఎలా బ‌య‌ట‌ప‌డ్డాడు? రేణుక (ప్ర‌గ్యా జైస్వాల్) ఎవ‌రు? ఆమెతో ప్రేమాయ‌ణం ఎలా సాగింది అనేదే క‌థ‌.

నటీన‌టుల ప్ర‌తిభః
బ్రాహ్మ‌ణుడిగా చేయ‌డం మంచు విష్ణుకు ఇదేమీ మొద‌టిసారి కాదు. ఆల్రెడీ దేనికైనా రెడీలో చేసిన‌దే. అదే త‌రహాలో ఈ సినిమాలోనూ మంచి న‌ట‌న క‌న‌బ‌రిచాడు. చాలా రోజుల త‌ర్వాత బ్ర‌హ్మానందం ఫుల్ లెంగ్త్ కామెడీ రోల్ లో అల‌రించాడు. హీరోయిన్ ప్ర‌గ్యా జైస్వాల్ త‌న అందంతో ఆక‌ట్టుకుంటుంది. సెకండాఫ్ లో థ‌ర్టీ ఇయ‌ర్స్ పృథ్వీ పాత్ర కాసేపే ఉన్న‌ప్ప‌టికీ, ఉన్నంత‌సేపు అల‌రిస్తుంది. మిగిలిన వారిలో ప్ర‌భాస్ శ్రీను, ప్ర‌వీణ్, భ‌ర‌త్, సురేఖ‌వాణి, పోసాని, కోటా శ్రీనివాస‌రావు, ఠాకూర్ అనూప్ సింగ్,ప్ర‌దీప్ రావ‌త్ లు త‌మ పాత్ర‌ల ప‌రిధిలో బాగానే చేశారు.

సాంకేతిక నిపుణులుః
ఎప్ప‌టిలాగానే సినిమాకు రెగ్యూల‌ర్ క‌థను ఎంచుకున్న ద‌ర్శ‌కుడు ఇప్పుడు కూడా అదే దారిలో వెళ్లాడు. ఒక మామూలు క‌థ‌ను తీసుకుని దాన్ని న‌వ్వులబాట ప‌ట్టించాలని అనుకోవ‌డం అయితే అనుకున్నాడు కానీ, త‌ను చేసిన ప్ర‌య‌త్నం మాత్రం ఈసారి అంత‌గా ఫ‌లించలేదు. లాజిక్స్ ఫాలో అవ‌లేదు బాగానే ఉంది కానీ ఉన్న ఆర్టిస్టుల‌ను అయినా వాడుకుని ఉంటే వారి దారిలో వారి టైమింగ్ ను ఉప‌యోగించుకుని ఉండుంటే కామెడీ అయినా పండేది. డైర‌క్ట‌ర్ ఆ ప్ర‌య‌త్నం కూడా చేయ‌లేదు. కానీ సెకండాఫ్ లో మాత్రం పృథ్వీ క్యారెక్ట‌ర్ ను ఇన్వాల్వ్ చేసి కాస్త బాగానే న‌వ్వించాడు. అంత‌కుమించి సినిమాలో పెద్ద‌గా న‌వ్వుకునే సన్నివేశాలేమీ ఉండ‌వు. సినిమాటోగ్ర‌ఫీ బాగానే ఉంది. థ‌మ‌న్ సంగీతం ఇంప్రెస్ చేసే రేంజ్ లో లేక‌పోయినా, బాలేవు అనుకునే స్థాయిలో మాత్రం లేవు. రీరికార్డింగ్ బాగుంది. ఎడిటింగ్, నిర్మాణ విలువలు సినిమాకు తగ్గట్లున్నాయి.

ప్ల‌స్ పాయింట్స్ః
పృథ్వీ కామెడీ

మైన‌స్ పాయింట్స్ః
అన‌వ‌స‌ర‌మైన సీన్స్
లాజిక్ లేని క‌థ‌నం

పంచ్‌లైన్ః ఆచారి అమెరికా యాత్ర‌కు వీసా లేదు
ఫిల్మ్‌జ‌ల్సా రేటింగ్ః 2/5

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here