ట్రైల‌ర్ టాక్: అమెరికా నుంచి అంతా ఫ‌న్ యే…

0
170
మెగా హీరో గా కాకుండా తనకంటూ ప్రత్యేక ఇమేజ్ ని క్రియేట్ చేసుకోవాలని ఎప్పటికప్పుడు ప్రయత్నాలు చేస్తున్న అల్లు శిరీష్ ఇప్పుడు ‘ఏబీసీడీ’ తో తన లక్ ని పరీక్షించుకోబోతున్నాడు. రుక్షర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ ఇవాళే రిలీజ్ అయింది.
అమెరికా లో పుట్టి విలాసవంతమైన జీవితాన్ని అనుభవిస్తున్న అవి (శిరీష్) కొన్ని కారణాల వాళ్ళ ఇండియా కు వస్తాడని తెలుస్తుంది. ఇక్కడ తన స్నేహితుడు భరత్ తో క‌లిసి మ‌ధ్య త‌ర‌గ‌తి జీవితాన్ని అనుభ‌వించాల్సి వ‌స్తుంది. ఈ టైమ్ లోనే త‌న‌కు ప్రేయ‌సి దొర‌కడం, అనుకోకుండా రాజ‌కీయాల్లో ఇరుక్కుపోవ‌డం.. ఇలా చివ‌ర‌కు ఎన్నెన్ని పాట్లు ప‌డి త‌న ప్రేమ‌ను, పంతాన్ని ఎలా నెగ్గించుకున్నాడ‌న్న‌దే క‌థ గా తెలుస్తుంది.

త‌న బాడీ లాంగ్వేజ్ కు బాగా సెట్ అయ్యే క్యారెక్ట‌ర్ కావ‌డంతో శిరీష్ చాలా ఎన‌ర్జిటిక్ గా, ఆ పాత్ర‌లో ఒదిగిపోయిన‌ట్లు క‌నిపిస్తున్నాడు. చైల్డ్ ఆర్టిస్ట్ గా అంద‌రికీ ప‌రిచ‌య‌మున్న భ‌ర‌త్ ఇప్పుడు గెడ్డం మీసంతో క‌నిపించి స‌ర్‌ప్రైజ్ ఇచ్చాడు. దానికి తోడు వెన్నెల కిషోర్ కామెడీ కూడా హెల్ప్ అయ్యేలా ఉంది. క‌ళ్యాణ్ రామ్ సంభాష‌ణ‌లు బాగా వ‌ర్క‌వుట్ అయ్యాయి. మంచి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో జూదా శాండీ మ్యాజిక్ చేశాడు. మొత్తానికి ట్రైల‌ర్ గురించి మంచి పాజిటివ్ రివ్యూలే వ‌స్తున్నాయి. మ‌రి అల్లు శిరీష్ కు ఈ సినిమా తో మంచి కమ్ బ్యాక్ వ‌స్తుంద‌ని ఆశిద్దాం.