ABCD Movie Review

0
398

మెగా హీరోగా, అల్లు అర్జున్ త‌మ్ముడిగా ఇండ‌స్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన అల్లు శిరీష్ కు ఇప్ప‌టి వ‌ర‌కు సాలిడ్ హిట్ అనేది త‌న కెరీర్ లో ప‌డ‌లేదు. ఎంత చేసినా ఏం లాభం లేక‌పోవ‌డంతో ఈసారి మ‌ల‌యాళం హిట్ సినిమా ఎబిసిడి(అమెరిక‌న్ బార్న్ క‌న్‌ఫ్యూజ్డ్ దేశీ) ని అదే పేరుతో తెలుగులోకి రీమేక్ చేసాడు. మొద‌టి నుంచి మంచి అంచ‌నాలు క్రియేట్ చేసిన ఈ సినిమా ఏ మేర‌కు ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుందో స‌మీక్ష‌లో చూద్దాం.

అమెరికాలో పుట్టిపెరిగిన అరవింద్ అలియాస్ అవి(అల్లు శిరీష్)మల్టీ మిలియనీర్ ఎన్ఆర్ఐ విద్యాప్రసాద్(నాగబాబు)కు ఒక్క‌గానొక్క‌ వారసుడు. విచ్చ‌ల‌విడి లైఫ్ కు అల‌వాటు పడిన అవి డ‌బ్బుని లెక్క లేకుండా ఖ‌ర్చుపెట్ట‌డం చూసి విద్యా ప్ర‌సాద్ అర‌వింద్ కు డ‌బ్బు విలువ తెలియాల‌నే ఉద్ధేశ్యంతో నెలకు కేవ‌లం 5వేలు మాత్ర‌మే ఇస్తూ ఎంబిఎ చేయ‌డం కోసం ఇండియాకు పంపిస్తాడు. అర‌వింద్ కు తోడుగా అత్త కొడుకు బాల ష‌ణ్ముగం అలియాస్ బాషా (భ‌ర‌త్) కూడా వ‌స్తాడు. ఇండియా వ‌చ్చాక అవికి నేహ (రుక్స‌ర్) ప‌రిచ‌యం అవ‌డం, అనుకోకుండా రాజ‌కీయ నాయ‌కుల‌తో పోటీ ప‌డటం జ‌రుగుతాయి. చివ‌ర‌కు అర‌వింద్ డ‌బ్బు విలువ, జీవితం విలువ ఎలా తెలుసుకున్నాడ‌న్న‌దే క‌థ‌.

అర‌వింద్ గా అల్లు శిరీష్ బాగా చేశాడు. అక్క‌డ‌క్క‌డా త‌న కామెడీ టైమింగ్ తో ఆక‌ట్టుకుంటాడు. అటు రిచ్ మెన్ గా, ఇటు గ‌ల్లీ బాయ్ గా రెండూ షేడ్స్ లో క‌నిపించిన శిరీష్ న‌టుడిగా సినిమా సినిమాకు న‌ట‌న‌లో ఒక్కొక్క మెట్టు ఎక్కుతున్నాడు. చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎప్పటినుంచో అల‌రిస్తూ వ‌స్తున్న భ‌ర‌త్ కు హీరోతో పాటుగా ఎప్పుడూ తెర‌పైనే ఉండే ఛాన్స్ వ‌చ్చినా కానీ త‌న‌దైన ముద్ర వేసే మ్యాజిక్ ఏమీ చేయ‌లేక‌పోయాడు. మెయిన్ విల‌న్ గా చేసిన రాజా (సిరివెన్నెల గార‌బ్బాయి) బాగా చేశాడు కానీ ఆ క్యారెక్ట‌ర్ కి అత‌ను సూట్ అవ‌లేదు. నాగ‌బాబు ఎప్ప‌టిలాగే ఫ‌ర్వాలేద‌నిపించాడు. హీరో ఫ్లాష్ బ్యాక్ లో తండ్రి గురించి అల్లే క‌థ మాత్రం కాస్త న‌వ్వులు పూయిస్తుంది. ఇక శుభ‌లేఖ సుధాక‌ర్, కోటా లాంటి సీనియ‌ర్ న‌టులున్నా వారు ఒక‌టి రెండు సీన్ల‌కే ప‌రిమిత‌మ‌య్యారు. వెన్నెల కిషోర్ ఉన్నంత సేపూ న‌వ్వుకోవ‌చ్చు కానీ త‌న స్క్రీన్ టైమ్ త‌క్కువే. మిగిలిన వారు త‌మ త‌మ ప‌రిధుల్లో చేసుకుని పోయారు.
మంచి రీమేక్ థీమ్ తో ప్రేక్ష‌కుల్ని అల‌రిద్దామ‌నుకుని ద‌ర్శ‌కుడు తీసుకున్న నిర్ణ‌యం బానే ఉంది కానీ దాన్ని అమ‌లు ప‌ర‌చ‌డంలోనే ద‌ర్శ‌కుడు ఫెయిల‌య్యాడు. చిన్న చిన్న సీన్లు సైతం కామెడీ మీదే ఆధార‌ప‌డే ఇలాంటి సినిమాల్లో ద‌ర్శ‌కుడు దాని మీద దృష్టి పెట్ట‌క‌పోవ‌డం బాధాక‌రం. రామ్ సినిమాటోగ్ర‌ఫీ సినిమాకి చాలా పెద్ద హైలైట్. త‌న విజువల్స్ తో సినిమాకు రిచ్ లుక్ ని తీసుకొచ్చాడు. జుదా శాండీ సంగీతంలో వచ్చిన మెల్ల మెల్ల‌గా పాట మిన‌హాయించి పెద్దగా చెప్పుకోవ‌డానికేమీ లేదు. రీరికార్డింగ్ కూడా ఆక‌ట్టుకునే స్థాయిలో ఏమీ లేదు. న‌వీన్ నూలి ఎడిటింగ్ ఇంకాస్త షార్ప్ గా ఉండాల్సింది. నిర్మాణ విలువ‌లు సినిమా రేంజ్ కంటే ఎక్కువ‌గానే చాలా బావున్నాయి.

ప్ల‌స్ పాయింట్స్ః
సినిమాటోగ్ర‌ఫీ
వెన్నెల కిషోర్ కామెడీ
నిర్మాణ విలువ‌లు

మైన‌స్ పాయింట్స్ః 

బ‌ల‌మైన స‌న్నివేశాలు లేక‌పోవ‌డం

పంచ్‌లైన్ః క‌న్‌ఫ్యూజ‌న్ ఉంది.. డ్రామానే లేదు
ఫిల్మ్‌జ‌ల్సా రేటింగ్ః 3/5 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here