‘7’ Movie Review

0
1006

థ్రిల్ల‌ర్ సినిమాల మీద ఎప్ప‌టికీ క్రేజ్ ఉంటూనే ఉంటుంది. కరెక్ట్ కంటెంట్ ఉండి, మంచి స్క్రీన్ ప్లే తో సినిమాను ప్రెజెంట్ చేస్తే సీజ‌న్ తో సంబంధం లేకుండా సినిమాలు ఆడేస్తాయి. చాలా గ్యాప్ త‌ర్వాత హ‌వీష్ హీరోగా థ్రిల్ల‌ర్ జాన‌ర్ లో ర‌మేష్ వ‌ర్మ నిర్మాత‌గా మారి స్వయంగా క‌థ అందించి నిజార్ ష‌ఫీని ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం చేస్తూ ‘7(సెవెన్)’ సినిమాను తెర‌కెక్కించాడు. మ‌రి ఈ థ్రిల్ల‌ర్ ప్రేక్ష‌కుల‌ను ఏ మేర‌కు ఆక‌ట్టుకుంటుంది. ఏకంగా ఆరుగురు హీరోయిన్ లు న‌టించిన 7 ఆడియ‌న్స్ ను మెప్పించిందా లేదా స‌మీక్ష‌లో చూద్దాం.

సాఫ్ట్‌వేర్ ఇంజ‌నీర్ గా ప‌ని చేస్తున్న కార్తిక్ (హ‌వీష్) అదే ఆఫీస్ లో ప‌ని చేస్తున్న త‌న కొలీగ్ ర‌మ్య (నందితా శ్వేత‌)ను ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. త‌ర్వాత ఒక రోజు త‌న భ‌ర్త క‌నిపించట్లేదంటూ పోలీసుల‌కు ఫిర్యాదు చేస్తుంది. అదే త‌రుణంలో ర‌మ్య మాదిరిగానే జెన్నీ(అనీషా అంబ్రోస్), ప్రియ (త్రిథా చౌద‌రి)లు కూడా త‌మ భ‌ర్త‌లు క‌నిపించ‌ట్లేద‌ని ఫిర్యాదు చేస్తారు. ఈ క్ర‌మంలో సిటీలో జ‌రిగే వ‌రుస హ‌త్య‌లు పోలీసుల‌కు పెద్ద స‌వాలుగా మారతాయి. ఈ హ‌త్య‌ల వెనుక హ‌స్తం ఎవ‌రిది..? అస‌లు ఈ హ‌త్య‌ల వెనుక ఎవ‌రి హ‌స్త‌ముంది? అనే ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

లాంగ్ గ్యాప్ త‌ర్వాత నటించిన హ‌వీష్ ఇంట్ర‌స్టింగ్ క‌థ‌ను ఎంచుకున్నాడు. కానీ క‌థ‌కు త‌గ్గ వేరియేష‌న్స్ చూపించ‌డంలో మాత్రం ఫెయిల్ అయ్యాడు. న‌టుడిగా ప్రూవ్ చేసేందుకు హ‌వీష్ ఇంకా బాగా క‌ష్ట‌ప‌డాలి. హీరోయిన్లుగా క‌నిపించిన ఆరుగురిలో ఎక్కువ స్క్రీన్ టైమ్ ఉన్న‌ది మాత్రం రెజీనాకే. డిఫ‌రెంట్ షేడ్స్ ఉన్న పాత్ర‌లో రెజీనా న‌ట‌న ఆక‌ట్టుకుంటుంది. మిగిలిన హీరోయిన్లు నందితా శ్వేత‌, అనీషా, త్రిథా చౌద‌రి , అదితి ఆర్య‌లు వారి ప‌రిధి మేర‌కు ఆక‌ట్టుకున్నారు. పోలీస్ ఆఫీస‌ర్ గా రెహ‌మాన్ పర్ఫెక్ట్ గా సెట్ అయ్యాడు. ఇత‌ర న‌టీన‌టులు వారి వారి ప‌రిధుల్లో బాగానే చేశారు.

మంచి క‌థ‌ను రెడీ చేసుకున్న ర‌మేష్ వ‌ర్మ దాన్ని తెర‌పైకి తీసుకువ‌చ్చి, ప్రేక్ష‌కుల‌కు ప్ర‌జెంట్ చేయ‌డంలో మాత్రం విఫ‌ల‌మ‌య్యాడు. థ్రిల్ల‌ర్ సినిమాకు కావాల్సిన స్క్రీన్ ప్లే 7 లో మిస్ అయింది. ఇంట్రెస్టింగ్ గా సినిమాను స్టార్ట్ చేసిన ద‌ర్శకుడు, ల‌వ్ స్టోరీల ద‌గ్గ‌రకొచ్చే స‌రికి ఢీలా ప‌డిపోయాడు. కాక‌పోతే ఉన్నంత‌లో సెకండాఫ్ ను కాస్త గ్రిప్పింగ్ గా తీశాడు. క్లైమాక్స్ వ‌ర‌కు అదే గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే ఉన్నా 7 స్థాయి వేరేలా ఉండేదేమో. కానీ క్లైమాక్స్ విష‌యంలో మ‌రోసారి త‌డ‌బ‌డి తప్పు చేశాడు. ఇలాంటి సినిమాల‌కు సినిమాటోగ్ర‌ఫీ, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కీల‌కం. ఈ రెండింటి విష‌యంలో 7 మంచి మార్కులే కొట్టేసింది. నిజార్ ష‌ఫి ప్ర‌తీ ఫ్రేమ్ ను రిచ్ గా, క‌ల‌ర్ ఫుల్ గా చూపించ‌డంలో స‌క్సెస్ అయ్యాడు. చేత‌న్ భ‌ర‌ద్వాజ్ త‌న బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో ప్ర‌తీ సీన్ ను బాగా ఇంట్రెస్టింగ్ గా క్రియేట్ చేశాడు. ఎడిట‌ర్ త‌న క‌త్తెర‌కు ఇంకాస్త ప‌దును పెట్టుండాల్సింది. నిర్మాణ విలువ‌లు సినిమాకు త‌గ్గ‌ట్లుగా ఉన్నాయి.

ప్ల‌స్ పాయింట్స్ః
సినిమాటోగ్ర‌ఫీ
రీరికార్డింగ్

మైన‌స్ పాయింట్స్ః
స్లో ఫ‌స్టాఫ్
స్క్రీన్ ప్లే

పంచ్‌లైన్ః 7… అంతుచిక్క‌ని థ్రిల్ల‌ర్
ఫిల్మ్‌జ‌ల్సా రేటింగ్ః 2.5/5

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here