47 Days Movie Trailer Talk

0
144
ఎన్ని సినిమాలు వ‌చ్చినా ఎప్ప‌టిక‌ప్పుడు రిలీజ్ కు ముందు హైప్ తెచ్చే సినిమాలు థ్రిల్ల‌ర్ సినిమాలే. ఒక్క టీజ‌ర్ తో సినిమా మీద అంచ‌నాలు పెంచేయొచ్చు. ఈ కోవ లో ఇప్పుడు స‌త్య‌దేవ్ హీరోగా 47 డేస్ అనే సినిమా రాబోతుంది. ఈ సినిమా ట్రైల‌ర్ కొద్ది సేప‌టి క్రిత‌మే రిలీజైంది.
వృత్తిరీత్యా ఏసీపీ అయిన స‌త్య జీవితమే ఒక మిస్ట‌రీ త‌ప్ప దాన్ని మించిందేమీ లేదు లైఫ్ లో అనుకునే ర‌కం. అలాంటి వ్య‌క్తికి తన జీవితంలోకి ఒక మిస్ట‌రీలా అమ్మాయి ఎంట‌ర‌వ‌డం, ఆమె వ‌చ్చిన ద‌గ్గ‌ర నుంచి అంతా ఒక మిస్ట‌రీ లా మార‌డం జ‌రుగుతుంది. అస‌లు త‌నకు ఆ ప‌రిస్థితి రావ‌డానికి కార‌ణ‌మేంటి? ఆ అమ్మాయికి, త‌న‌కు సంబంధమేంటి… ఆ మిస్ట‌రీని త‌నెలా చేధించాడ‌న్న‌ది మిగ‌తా క‌థ లా తెలుస్తుంది.

మొత్తానికి ట్రైల‌ర్ చూడగానే అంచ‌నాలు పెంచే విధంగానే ఉంది. స‌త్య దేవ్ న‌ట‌న‌, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చాలా బావున్నాయి. ఇదే రేంజ్ లో సినిమా కూడా ఉంటే టాలీవుడ్ కు మ‌రో మంచి స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ వ‌చ్చిన‌ట్లే.