సెట్స్ పైకి అల్లు అర్జున్ 19వ సినిమా

0
145
తెలుగు తెరపై తమ జోరును కొనసాగిస్తోన్న స్టార్ హీరోల జాబితాలో అల్లు అర్జున్ కి ప్రత్యేకమైన స్థానం వుంది. తన 19వ సినిమాను ఆయన త్రివిక్రమ్ దర్శకత్వంలో చేయనున్నాడనే టాక్ కొన్ని రోజులుగా వినిపిస్తోంది. తాజాగా ఈ సినిమా పూజా కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. అల్లు అర్జున్ .. దర్శకనిర్మాతలు ఈ పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. త్వరలోనే రెగ్యులర్ షూటింగు మొదలుకానుంది.
ఈ సినిమాలో కథానాయికగా పూజా హెగ్డేను ఎంపిక చేసుకున్నారు. గతంలో అల్లు అర్జున్ సరసన ఆమె ‘దువ్వాడ జగన్నాథం’లో మెప్పించిన సంగతి తెలిసిందే. హారిక అండ్ హాసిని .. గీతా ఆర్ట్స్ వారు సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ సినిమాకి తమన్ సంగీతాన్ని సమకూర్చుతున్నాడు. ఇంతకుముందు త్రివిక్రమ్ తో అల్లు అర్జున్ చేసిన రెండు సినిమాలు భారీ విజయాలను అందుకున్నాయి. ఈ సినిమాతో ఈ ఇద్దరి ఖాతాలో హ్యాట్రిక్ హిట్ చేరుతుందేమో చూడాలి.