‘118’ మూవీ రివ్యూ

0
2588

ఎప్ప‌టినుంచో త‌న కెరీర్ కు మైలురాయిగా నిలిచిపోయే చిత్రం కోసం ఎదురుచూస్తున్న నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ హీరోగా.. ప్ర‌ముఖ సినిమాటోగ్ర‌ఫ‌ర్ కేవీ గుహ‌న్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన సస్పెన్స్ థ్రిల్ల‌ర్ ‘118’. టీజ‌ర్, ట్రైల‌ర్ ల‌తోనే సినిమా మంచి అంచనాల‌ను క్రియేట్ చేసిన ఈ మూవీ మ‌రి ఆ అంచనాల‌ను అందుకుందా లేదా అన్న‌ది స‌మీక్ష‌లో చూద్దాం.

వృత్తి రీత్యా ఇన్వెస్టిగేటివ్ జ‌ర్న‌లిస్ట్ అయిన గౌత‌మ్ (క‌ళ్యాణ్ రామ్) ఏదైనా మొద‌లు పెడితే మ‌ధ్య‌లో వ‌దిలేసే అల‌వాటు అస‌లు లేదు. అలాంటి గౌత‌మ్ ను ఓ క‌ల త‌ర‌చూ వెంటాడుతూ ఉంటుంది. ఓ అమ్మాయిని ఎవ‌రో కొట్ట‌డం, కారును పెద్ద కొండ మీద నుంచి చెరువులో ప‌డేయ‌టం లాంటి స‌న్నివేశాలు క‌నిపించ‌డ‌టంతో ఆ క‌ల గురించి తెలుసుకోవాల‌ని నానా ప్ర‌య‌త్నాలు చేస్తాడు గౌత‌మ్. అస‌లు త‌న‌కు క‌ల‌లో క‌నిపించిన అమ్మాయి నిజంగా ఉందా? ఉంటే ఆ అమ్మాయి గౌత‌మ్ ను ఎందుకు వెంటాడుతుంది? ఆమెను కొడుతూ వెంటాడుతుందెవ‌రు? ఈ క‌ల‌ను గౌత‌మ్ ఎలా ఛేజ్ చేసి సాల్వ్ చేశాడ‌న్న‌దే మిగిలిన స్టోరీ.

గ‌తంలో ఇజం సినిమాలో రిపోర్ట‌ర్ గా క‌నిపించిన క‌ళ్యాణ్ రామ్ ఇప్పుడు మ‌రోసారి జ‌ర్న‌లిస్ట్ పాత్ర‌లో ఆక‌ట్టుకున్నాడు. మునుప‌టి కంటే స్టైలిష్ గా, లుక్స్ ప‌రంగానూ చాలా బాగా క‌నిపించాడు. యాక్ష‌న్ సీన్స్ లోనూ, న‌ట‌న‌లోనూ సింప్లీ సూప‌ర్బ్ అనేలా మెప్పించాడు. థ్రిల్ల‌ర్ సినిమా కావ‌డంతో రొమాన్స్, డ్యాన్స్ ల‌కు పెద్ద‌గా స్కోప్ లేదు. తెర మీద క‌నిపించింది కొద్ది సేపే అయినా నివేదా థామ‌స్ సినిమాకే హైలైట్ గా నిలుస్తూ త‌న మార్క్ ను మ‌రోసారి చూపించింది. షాలినీ పాండే పాత్ర‌కు పెద్ద‌గా ప్రాధాన్య‌త లేక‌పోయినా ఉన్నంత‌లో మంచి న‌ట‌న‌తో ఆక‌ట్టుకుంది. మిగిలిన వారిలో రాజీవ్ క‌న‌కాల, హ‌రితేజ‌, ప్ర‌భాస్ శ్రీను, నాజ‌ర్ వారి వారి ప‌రిధుల్లో బాగా చేశారు.

సినిమాటోగ్రాఫర్‌గా టాలీవుడ్‌కు సుపరిచితుడైన కేవీ గుహన్‌, 118 సినిమాతో దర్శకుడిగా మారాడు. 2010లో ఓ తమిళ సినిమాను డైరెక్ట్ చేసిన గుహన్ చాలా గ్యాప్ త‌ర్వాత ఇప్పుడు తెలుగులో ఈ సినిమాతో మరోసారి మెగా ఫోన్‌ పట్టుకున్నాడు. రొటీన్‌ ఫార్ములా సినిమాకు భిన్నంగా ఓ సైన్స్‌ఫిక్షన్‌ ఇన్వెస్టిగేషన్‌ థ్రిల్లర్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ను తీసుకుని దానితో క‌థ‌ను మొద‌లుపెట్టిన ద‌ర్శ‌కుడు ప్రేక్ష‌కుడిని త‌న ఎంగేజింగ్ స్క్రీన్ ప్లే తో క‌ట్టిప‌డేశాడు. అనవసరమైన సన్నివేశాలను ఇరికించకుండా సినిమా అంతా ఒకే మూడ్ లో వెళ్తూ బోర్ కొట్టించ‌కుండా చేశాడు. ఫస్ట్‌ హాఫ్ రేసీ స్క్రీన్‌ప్లే, థ్రిల్లింగ్‌ సీన్స్‌తో నడిపించిన దర్శకుడు ద్వితీయార్థంలో కాస్త స్లో అయ్యాడు. సినిమాటోగ్ర‌ఫీ పరంగా కూడా గుహన్ ఫుల్‌ మార్క్స్‌ సాధించాడు. స్టైలిష్‌ టేకింగ్‌తో మెప్పించాడు. శేఖ‌ర్ చంద్ర అందించిన సంగీతం సినిమాకు ప్రాణం పోసిందనే చెప్పాలి. ఇలాంటి థ్రిల్ల‌ర్ల‌కు నేప‌థ్య సంగీత‌మే ముఖ్యం. త‌న రీరికార్డింగ్ తో ప్ర‌తీ సీన్ ను మ‌రింత ఎలివేట్ అయ్యేలా చేశాడు సంగీత ద‌ర్శ‌కుడు. ఎడిటింగ్ బావుంది. సినిమాకు ఉన్న ప్ల‌స్ పాయింట్స్ లో ర‌న్ టైమ్ కూడా ఒక మేజ‌ర్ ప్ల‌స్. నిర్మాణ విలువ‌లు సినిమా స్థాయికి త‌గ్గ‌ట్లున్నాయి.

ప్ల‌స్ పాయింట్స్ః
క‌ళ్యాణ్ రామ్, నివేదా థామ‌స్ ల న‌ట‌న
బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్
సినిమాటోగ్ర‌ఫీ

మైన‌స్ పాయింట్స్ః
సెకండాఫ్ లో స్లో నెరేష‌న్
ఎంట‌ర్‌టైన్‌మెంట్ లేక‌పోవ‌డం

పంచ్‌లైన్ః క‌ళ్యాణ్‌రామ్ క్యూరియాసిటీ త‌గ్గిన‌ట్లేనా?
ఫిల్మ్‌జ‌ల్సా రేటింగ్ః 3/5

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here