కొణిదెల బ్యానర్‌లో అఖిల్.. రాంచరణేనా, ఉత్కంఠ రేపుతున్న క్రేజీ కాంబినేషన్!

0
254

అఖిల్ అక్కినేని ప్రస్తుతం యువతలో క్రేజ్ తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. అదే సమయంలో తొలి హిట్ కోసం ఎంతో శ్రమిస్తున్నాడు. అఖిల్ నటించిన మొదటి రెండు చిత్రాలు నిరాశపరచడంతో ప్రస్తుతం ఈ యువ హీరో దృష్టి మొత్తం మజ్ను చిత్రంపై ఉంది. తొలి ప్రేమ ఫేమ్ వెంకీ అట్లూరి దర్శత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఇదిలా ఉండగా అఖిల్ తదుపరి చిత్రాలపై ఆసక్తికరమైన వార్తలు వస్తున్నాయి. త్వరలో అఖిల్ మెగా కాంపౌండ్ లోకి అడుగు పెట్టబోతున్నట్లు టాక్.

మెగా, అక్కినేని మధ్య

మెగా, అక్కినేని కుటుంబాల మధ్య మంచి రిలేషన్ ఉంది. చిరంజీవి, నాగార్జున మంచి స్నేహితులు కూడా. ఈ బంధమే తాజాగా వస్తున్న వార్తలకు బలాన్ని చేకూరుస్తోంది. కొణిదెల బ్యానర్ లో అఖిల్ నటించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ క్రేజీ కాంబినేషన్ సెట్ కావడానికి కారణం మెగా పవర్ స్టార్ రాంచరణ్ అని వార్తలు వస్తున్నాయి.

మాస్ డైరెక్టర్

ఈ చిత్రానికి మాస్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను దర్శత్వం వహిస్తాడని న్యూస్ వినిపిస్తోంది. కొణిదెల ప్రొడక్షన్స్ లో తెరకెక్కబోయే ఈ చిత్రానికి రాంచరణ్ నిర్మాతగా వ్యవహరిస్తాడా లేక కేవలం సమర్పకుడిగా మాత్రమే ఉంటాడా అనేది తెలియాల్సి ఉంది. దీనిపై ఎలాంటి అధికారిక సమాచారం లేనప్పటికీ అటు సోషల్ మీడియాలో, ఇటు సినీవర్గాల్లో ఈవార్త హాట్ టాపిక్ గా మారింది.

భారీ చిత్రాలతో

కొణిదెల ప్రొడక్షన్స్ భారీ చిత్రాలకు వేదికగా మారుతోంది. ఈ బ్యానర్ లో రూపొందిన తొలి చిత్రం మెగాస్టార్ నటించిన ఖైదీ నెం 150 ఘనవిజయం సాధించింది. ఇప్పుడు 200 కోట్ల భారీ బడ్జెట్ చిత్రం సైరా నరసింహా రెడ్డి రూపొందుతోంది. ఈ రెండు చిత్రాలకు నిర్మాత రాంచరణే. కాగా తన సంస్థ పరిధిని పెంచాలని భావిస్తున్న చరణ్ ఇతర హీరోలతో కూడా సినిమాలు చేసేందుకు రెడీ అవుతున్నారట.

పెద్ద అన్నయ్య

హలొ చిత్ర ప్రీరిలీజ్ ఈవెంట్ వేదికగా అఖిల్.. రాంచరణ్ ని తన పెద్ద అన్నయ్యగా, చిరంజీవిని పెదనాన్నగా అభివర్ణించిన సంగతి తెలిసిందే. ఆసక్తి రేపుతున్న ఈ మెగా, అక్కినేని కాంబినేషన్ కు ఎప్పుడు అంకురార్పణ జరుగుతుందో చూడాలి. అఖిల్ నటిస్తున్న మజ్ను చిత్రం వచ్చే ఏడాది విడుదల కానుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here